చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన

Published: Friday April 14, 2023
ప్రజా పాలన షాబాద్*== షాబాద్ మండల్ బోడంపహాడ్ గ్రామంలో సర్పంచ్ కృష్ణారెడ్డి ఎంపిటిసి సరళ రామచంద్ర రెడ్డి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా టి పి సి సి మాజీ అధికార ప్రతినిధి పామేన భీం భారత్ సున్నపు వసంతం దేశముల ఆంజనేయులు పి ఎస్ ఎన్ మూర్తి ఐఏఎస్ సిదోజి రావు ఆఫీసర్ ఫోరం గడ్డం ఝాన్సీ దళిత స్త్రీ శక్తి నేషనల్ కన్వీనర్ గద్దర్ ప్రజా గాయకుడు విమలక్క అశోక్ జాతీయ కళామండలి అధ్యక్షుడు వెంకటేష్ చౌహన్ బి ఎస్ పి కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి దళిత స్త్రీ శక్తి తెలంగాణ కోఆర్డినేటర్ రావడం జరిగింది
 
 ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాల యాదయ్య మాట్లాడుతూ ఎ సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యూహాలు ఆచరణ నాయకత్వం సామాజిక అంగీకారాన్ని నిర్వహించే తత్వ శాస్త్ర సూత్రాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించిన గొప్ప ఉద్యమకారుడు డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశ మాన్య విద్యావేత్త దళిత హక్కుల పోరాట యోధుడు సామాజిక సమాతలను రూపమాపడానికి అవిశ్రాంతంగా కృషిచేసిన ధీరుడు అని అన్నారు
 అదేవిధంగా ప్రజాస్వామ్య పౌరసత్వానికి ఓటు హక్కు అత్యంత ప్రాథమిక అవసరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు సార్వత్రిక ఓటు హక్కును పొందలేదు సామాన్యులు తమపై ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారని ఉన్నత వర్గాలు భావిస్తాయి సార్వత్రిక ఓటు హక్కు అడ్డంకులు ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు ఆస్తిలేని వారు జాతి మైనార్టీలకు ఓటు హక్కుని నిరాకరించబడింది అని అన్నారు
 
ఈ సందర్భంగా మాజీ అధికార ప్రతినిధి పామిన భీమ్ భారత్ సున్నపు వసంతం దేశముల ఆంజనేయులు బిఎస్ఎన్ మూర్తి ఐఏఎస్ మాట్లాడుతూ బోడం పహాడ్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు షాబాద్ మండలం పోడంపహాడ్ గ్రామంలో ఇంతమంది యువకులు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు యువకులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు మద్యపానం ధూమపానానికి అలవాటు పడి యువత అంతా చెడుదారిన పడుతు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండీ ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముఖ్య భూమికను పోషించిన యువకుల అందరికీ ధన్యవాదాలు తెలిపారుడాక్టర్ బాబా సాహెబ్ భీం రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో భాగంగా 
ఈరోజు షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ గారి 132  జయంతి  సందర్బంగా పూలమాలలు  వేసి నమస్సుమాంజలి  తెలిపారు. ఈ సందర్బంగా పీసీసీ అధికార  ప్రతినిధి భీం భరత్  గారు మాట్లాడుతూ దళిత, పీడిత వర్గాల ఆశజ్యోతి,దళిత బంధావుడు, అంటరాని తనని కులా వివక్షను రూపుమాపిన  మహానుభావులు మూతికి  ముంత,  నడుముకు  తాటి ఆకు కట్టి హేళన చేసిన  రోజులు గుర్తు చేశారు. ఆ లాంటి రోజుల నుండి  అక్షరం  అనే ఆయుధం తో చదువుకోని  భారతదేశనికి  మొదటి న్యాశాఖమంత్రి వర్యులుగా అవకాశం వచ్చిన గడ్డిపరక తో  సమానమని విస్మరించిన  గొప్ప నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్,నేను కాదు భారతదేశం ప్రజలు  చదువుకొని  జ్ఞానవంతులుగా మరి   భారత రాజ్యాంగం ద్వారా గ్రామ స్థాయి నుండి పార్లమెంటవరకు  పదవులు  సర్పంచ్ నుండి మొదలుకొని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పదవుల వరకు ఎదగాలని అని అన్నారు ఈ దేశం కులల మీద  మతాల  మీద  కాదు భారతరాజ్యాంగం ద్వారా పరిపాలించబడుతుంది అన్నారు.  కొందరు మనువాదుల స్వార్ధ రాజకీయాల కోసం రాజ్యాంగాని మార్చాలని  చూస్తున్నారు అలాంటి వారినీ రాబోయే ఎన్నికలలో  గద్దె దింపాలని  భారత రాజ్యాంగాని కాపాడుకోవాలని  కుల వివక్ష వలన  బడి  నుండి వెలివేయా బడిన  పట్టువదలని  విక్రమార్కుని వలే చితి మంటల వెలుగులో అక్షర  జ్ఞానాని నేర్చుకొని భారతదేశం గర్వించదగ్గ రాజ్యాంగని లిఖిచబడ్డారు.ఆయన  స్ఫూర్తిని స్మరిస్తూ ప్రతి  ఊరిలో  ఆయన  విగ్రహాని ప్రతిష్టించి ఆయన ఆశయలను  కొనసాగించాలి తెలిపారు. 
 
ఒక వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధిని సాధించడానికి విజ్ఞాన బలం ఎంతో దోహదం చేస్తుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాo బడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలకు దీటుగా జీవనం సాగించడానికి విజ్ఞాన బలం సహకరిస్తుందని అన్నారు విద్యతోనే ఒక వ్యక్తికి గౌరవం లభిస్తుంది అన్ని రకాల విద్యాబుద్ధులు అలవర్చుకున్న వ్యక్తులు ఉన్నత స్థానంలో జీవిస్తుంటారని అన్నారు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీలను అంటరానివారుగా చూసేవారు జీవితాంతం అంటరానివాళ్ళగా జీవించాలంటే విద్యను అభ్యసించకపోవడం ముఖ్య కారణం అని అన్నారు