ప్రభుత్వ పాఠశాలలోనే చేరండి మాటూర్ హైస్కూల్ ఉపాధ్యాయులు

Published: Tuesday August 31, 2021

మధిర, ఆగష్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి అంటూ మాటూర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం మాటూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పాఠశాల విద్యార్థుల ప్రతిభాకర పత్రాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు అందించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే పరిపూర్ణ విద్య అందుతుంది, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశాలామైన తరగతి గదులు, అనువైన ఆటస్థలం అందుబాటులో ఉంటాయి. కావున విద్యార్థులు అందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో చేరవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణ రావు, ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహమ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.