అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మన్మర్రి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు* *స్వేచ్

Published: Saturday April 15, 2023
*ప్రజాపాలన ప్రతినిధి షాబాద్ :.......    స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేడ్కర్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని *అంబేద్కర్ యువజన సంగం సభ్యులు గ్రామ పెద్దలు*  రాజ్యాంగ నిర్మాత విగ్ర‌హానికి యువజన సంఘం సభ్యులు ప్రజానాయకులు పెద్దలు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.....  డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ అంద‌రివాడని, కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిదని తెలిపారు. ఆయన ప్రఖ్యాతిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల భారీ విగ్రహాన్ని  దేశంలోని అతి ఎత్తైన స్మారక చిహ్నంగా నిలవనుందని పేర్కొన్నారు      సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యూహాలు ఆచరణ నాయకత్వం సామాజిక అంగీకారాన్ని నిర్వహించే తత్వ శాస్త్ర సూత్రాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించిన గొప్ప ఉద్యమకారుడు డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశ మాన్య విద్యావేత్త దళిత హక్కుల పోరాట యోధుడు సామాజిక సమాతలను రూపమాపడానికి అవిశ్రాంతంగా కృషిచేసిన ధీరుడు అని అన్నారు
 అదేవిధంగా ప్రజాస్వామ్య పౌరసత్వానికి ఓటు హక్కు అత్యంత ప్రాథమిక అవసరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు సార్వత్రిక ఓటు హక్కును పొందలేదు సామాన్యులు తమపై ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారని ఉన్నత వర్గాలు భావిస్తాయి సార్వత్రిక ఓటు హక్కు అడ్డంకులు ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు ఆస్తిలేని వారు జాతి మైనార్టీలకు ఓటు హక్కుని నిరాకరించబడింది అని అన్నారు  ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు