కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి

Published: Wednesday April 06, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి : ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బోడ. సామేలు  మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 5 19 0 8న జన్మించి ఉన్నత చదువులు చదువుకొని వెనుకబడిన వర్గాల కొరకు భారత పార్లమెంటు లో 30 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారత ఉప ప్రధానిగా ఉండి 19 35 లో అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డి ప్రే స్ట్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలకపాత్ర పోషించాడు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక శాఖ మంత్రిగా మరియు భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కొనసాగాడు 1977లో కాంగ్రెస్ పార్టీ ని విడిచి కాంగ్రెస్ ఫర్  డెమోక్రసీ పార్టీ పెట్టి జనతాపార్టీతో జత కట్టాడు. నేటికీ సామాజిక న్యాయం సమానత్వం బడుగు బలహీన వర్గాలకు రాని పరిస్థితి ఉంది. జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంటరానితనం సమానత్వం కుల నిర్మూలన కొరకు పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ఇబ్రహీంపట్నం కెవిపిఎస్ మండల కార్యదర్శి మేడిబావి. ఆనందు టౌన్ కన్వీనర్. వీరేశం టౌన్ సి ఐ టి యు కన్వీనర్ సిహెచ్. ఎల్లేశా సి ఐ టి యు రూరల్ కన్వీనర్  సిహెచ్. బుగ్గ రాములు నాయకులు బి యాదగిరి పి ఎన్ ఎం జిల్లా కార్యదర్శి జి గణేష్ తదితరులు పాల్గొన్నారు.