హోలీ ఎందుకు జరుపుకుంటారు..? హోలీ యొక్క విశిష్టత

Published: Friday March 18, 2022
మధిర మార్చి 17 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో: హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు గురువారం నాడుఅన్ని రాజకీయ పార్టీలు ఆనందోత్సవాల మధ్య హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలతో జరుపుకోవాలని తెలిపారుహోలీ వస్తుందంటే దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగ హోలీ అని చెప్పుకుంటారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం, హోలీని హోలికా పూర్ణిమ గా కూడా వ్యవహరిస్తారు. హోలీ ని కాముని పున్నమి డోలికోత్సవం  అని కూడా అంటారు. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటలలో ఆహుతి చేయాలని కోరతాడు. దీనితో హోలిక ప్రహ్లాదుడిని వళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకుతుంది. విష్ణు మాయ తో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోళికా దహనం అయిన రోజునే 'హోలీ' అని అంటారు. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోళికా దహనం నిర్వహిస్తారు. అదే రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సాహాన్ని జరుపుకున్నట్లు గా భావిస్తారు. ఈ హోళీ రోజున శ్రీ కృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లుగా కూడా చెబుతారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ అనురాగాలు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని నమ్ముతారు. కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు మహా రాజు ఉండేవాడు ఒక రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొర పెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు పోతాయి అని తెలుపుతాడు. ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయి అని వివరిస్తాడు. అప్పటినుంచి హోలీ పూజలు రాత్రి ఈ సమయంలో  నిర్వహించాలని పూర్వికులు తెలిపారు.హోలీ పండుగ విశిష్టత: హోలీ పండుగను వసంత పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ రోజు తెల్ల బట్టలు ధరించి ఒకరిపై ఒకరు రంగులు పోసుకుంటారు. పిల్లలు పెద్దలు ఈ హోళిని సందడిగా జరుపుకుంటారు. హిందూ పండుగ అయినా హోలీ ని అనేక దేశాల్లో ఇతర మతస్తులు కూడా జరుపుకుంటారు. హోలీకి ముందు రోజు హోలికను దహనం చేస్తారు. శ్రీ మహారాజు భక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశ్యపుడు మాట వినక హరిభక్తి లో మునిగి తేలు తాడు. హిరణ్యకశిపుడు చాలా శక్తివంతమైన రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి గొప్ప వరం పొందుతాడు. ఆ వరం వలన అతనికి పగలు గాని, రాత్రి గాని, ఇంట గాని, బయటగాని, నేలపై గానీ, నింగిలో గాని, జంతువుల వల్ల గాని, మనుషుల వల్ల గాని మరణం లేకుండా వరం పొందుతాడు. ఈ వరంతో ముల్లోకాలను ఆక్రమిస్తు త్రిలోకాధిపత్యం పొందుతాడు. తన కుమారుని హరిభక్తి అతని మనశ్శాంతిని దూరం చేస్తుంది. విష్ణువుకు పరమ విరోధి అయిన హిరణ్యకశిపుడు తన కుమారుని తీరుతో విసుగుచెంది ఏనుగులతో తొక్కిస్తు, పాములతో కనిపించిన ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదు. చివరికి మంటల్లో కాలకుండా ఉండ గలిగేలా తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని మంటలలో దహించి రమ్మంటాడు. అప్పుడు హోలిక ప్రహ్లాదుడిని మంటలలో తీసుకుని వెళుతుంది. హరిభక్తి ,విష్ణువు కటాక్షం వలన ప్రహ్లాదుడికి ఏమీ కాదు. హోలిక మాత్రం మంటల్లో దహన మౌతుంది. ఈ విధంగా హోళికా దహనం అయిన మరుసటి రోజును హోలీ పండుగగా జరుపుకుంటారు. అందరికీ హోలీీీీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూలు చిరు వ్యాపారం వ్యాపార సంఘంం అధ్యక్షులు ప్రజాపాలన స్నేహ విలేకరు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు తెలిపారు