అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికైన పవన్

Published: Saturday September 24, 2022

మధిర  సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి పట్టణానికి చెందిన జక్కేపల్లి పవన్ కుమార్ శర్మ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. విశ్రాంత ఉద్యోగి జక్కేపల్లి నరసింహారావు, పూర్వ ఉపాధ్యాయురాలు సునీత కుమారుడైన  జక్కేపల్లి పవన్ కుమార్ శర్మకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడం పట్ల బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు  వేమవరపు వెంకటేశ్వర శర్మ పరిషత్ తరుపున హర్షం వ్యక్తం చేశారు.జక్కేపల్లి పవన్ కుమార్ శర్మ నిట్ వరంగల్ నందు కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిహెచ్డీ  చేసి 2020లో డాక్టరేట్ పొందారు. పవన్ కుమార్ శర్మ పాఠశాల విద్యను సమతా కాన్వెంట్లో, ఇంటర్ సుశీల కళాశాలలో పూర్తి చేశారు. బీటెక్ కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ హైదరాబాద్ ఆరోరా కాలేజీలో పూర్తి చేశారు. పి.హెచ్.డి అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్ గా మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాదు నందు పనిచేస్తున్నారు.