*చేవెళ్ల మోడల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*

Published: Saturday March 11, 2023

చేవెళ్ల,మార్చి 10, (ప్రజాపాలన):-


చేవెళ్ల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెల్స్ ఫన్ ఫౌండేషన్ సహకారంతో శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ టేనావతి, జిహెచ్ఎం లక్ష్మి, జడ్.పి.హెచ్.ఎస్ చేవెళ్ల చేవెళ్ల గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం రజియ సుల్తానా, కేజీవీబీ హెచ్ఎం శ్వేతా రెడ్డి వెల్ఫేర్ సిఎస్ఆర్ కే .సురేఖ పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... స్త్రీ లేకపోతే జీవం లేదని,స్త్రీ  లేకపోతే సృష్టే లేదని అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూ ఎఫ్ హెచ్ కె ప్రొజెక్ట్ మేనేజర్ బి. భద్రయ్య, బీసీఐ మేనేజర్ రవీంద్రనాథ్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.