జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలు తొలగింపు

Published: Monday July 12, 2021

బెల్లంపల్లి  జులై 11 ప్రజాపాలన ప్రతినిధి : మూడో విడత పట్టణ ప్రగతి లో  భాగంగా ఆదివారం నాడు జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయించినట్లు ఒకటో వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరియు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్లకు తన వార్డులో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ దోమల బారిన పడి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చేసిన విజ్ఞప్తి మేరకు గత ఎన్నో సంవత్సరాలుగా పెరిగి వృక్షాలు అయినా పిచ్చి మొక్కలను ఆౠదివారం నాడు జెసిబి ని సమకూర్చగా మధునన్న నగర్, మున్సిపల్ వాటర్ ట్యాంక్,  ఫైర్ స్టేషన్, ఫ్లైఓవర్ బ్రిడ్జి చుట్టుపక్కల జేసీబీ తోని పిచ్చి మొక్కలు తొలగించడం జరిగిందనీ తెలిపారు. శుభ్రం చేసిన స్థలాల్లో రాబోయే కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. అడగగానే రోజంతా జెసిబి ని సమకూర్చిన మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత శ్రీధర్కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత కి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేశ్, జేఏసీ నాయకులు.బస్తి ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.