జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్

Published: Friday January 20, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 19, ప్రజాపాలన.
 
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో సరైన అనుమతి, వే బిల్ పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని మంచిర్యాల పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం జిల్లాలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి తరలించేందుకు సంబంధిత వాహన యజమానులు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సరైన అనుమతులు లేని కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.