ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలి * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Thursday December 08, 2022
వికారాబాద్ బ్యూరో 07 డిసెంబర్ ప్రజాపాలన : ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పాతూర్ గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ కామిడీ చంద్రకళ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ దొడ్ల లలిత నర్సింహారెడ్డితో కలిసి గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాతూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల వారికి ఆదేశించారు.గ్రామంలో లో ఓల్టేజ్ సమస్య ఉన్నందువలన గ్రామంలో 25 కెవి ట్రాన్స్ఫార్మర్, వ్యవసాయ భూములకు 25 కెవి రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో డ్యామేజ్ అయిన స్తంభాలను తొలగించాలన్నారు. పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని స్పష్టం చేశారు.
గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1, 11, 21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. గ్రామంలో కొత్తగా అండర్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ ప్రజలు తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగిస్తున్న పాతూర్ గ్రామ ప్రజలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుప్రియ సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ గయాజ్, మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సత్తయ్య గౌడ్ ఫకీరాఖాన్ ఎఎంసి వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కైల ఉపేందర్ రెడ్డి, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ అనిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.