మాటూరు పేట బాధ్యతలు తీసుకున్న వైద్యాధికారిగా వీరబాబు

Published: Tuesday January 03, 2023

మధిర రూరల్ జనవరి 2 (ప్రజా పాలన ప్రతినిధి) మండలంలోని మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా  హెచ్ వీరబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు మాటూరుపేట వైద్యులుగా పనిచేసిన వెంకటేష్ మధిర ఏరియా ఆసుపత్రికి బదిలీ చేశారు ఆయన స్థానంలో డాక్టర్ వీరబాబుని నియమించారు. వీరబాబు మాటూరుపేట ఆరోగ్య కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యాధికారి ఫాతూరి శ్రీనివాసరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు