టిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బీ, ర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

Published: Wednesday December 07, 2022
బోనకల్ ,డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం ,పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని నమ్మి ఆ దిశగా జాతినీ నడిపించిన మహా నుభావుడు ప్రపంచ మేధావి, న్యాయ కోవిదుడు, ఆర్థికవేత్త, "భారతరత్న" డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ "వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఆ మనసార స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు దొంతిబోయిన వెంకట్ రావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ కృషి ప్రశంసనీయం అని,
బడుగు, బలహీన వర్గాల వారి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మన జాతికి ఎంతో అమోఘమని దొంతిబోయిన వెంకట్ రావు పేర్కొన్నారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని ఆయన అన్నారు. దేశానికి అంబేద్కర్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఎదగాలని దళితబంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ చేపట్టారన్నారు. అంబేద్కర్‌ బాటలో పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను కేసీఆర్‌ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని వెల్లడించారు. దళిత్ ఎంపవర్‌మెంట్ కింద బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయనపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కుక్కల సుశాంత్, కుక్కల్ల ప్రసన్న, కానేపోగు నితిన్, శ్రీను, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.