అద్దె హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి.

Published: Friday March 05, 2021

బీసీ వెల్ఫేర్  జిల్లా అధికారి (డిడి)కి ఎస్ఎఫ్ఐ వినతి.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి04, ప్రజాపాలన: అద్దె బవనాల్లో కొనసాగుతున్న బిసి వెల్ఫేర్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతూ బుధవారం నస్పూర్ లోని  బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆ శాఖ జిల్లా అధికారి (డిడి)కి ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ అధ్వర్యంలో పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బీసీ  హాస్టల్ కు సొంత భవనాలు లేక అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.  అదేవిధంగా విద్యార్థులకు  భోజనం సంబంధించిన   మెనూ అమలు కావడం లేదని, విద్యార్థుల సంక్షేమం చుస్తున్నటువంటి వార్డెన్లు అందుబాటులో పూర్తిస్థాయిలో  ఉండడం లేదని పేర్కొన్నారు.  లక్షేట్టిపేట్ మండల  కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను బీసీ కళాశాల బాలర,బాలికల  హాస్టల్ గా తీసుకొని నడిపించాలని సూచించారు. బెల్లంపల్లి గర్ల్స్ ఇంటిగ్రేట్ హాస్టల్లో విద్యార్థి మృతి పై న జిల్లా అధికారులు వార్డెన్ ను సస్పెండ్ చేసి, పూర్తి స్థాయిలో   అధికారులు  నిష్పక్షపాతంగా  విచారణ కొనసాగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించలేనియేడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఆందోళన  కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.