కోవిద్ నిబంధనాలకు లోబడి శ్రీరామ నవమి:ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Thursday April 22, 2021

జగిత్యాల, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి: జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం మరియు విద్యానగర్ రామాలయంలో నూతనంగా ఆలయ కమిటీల పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దరూర్ క్యాంప్ మరియు విద్యానగర్ రామాలయ ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారాన్ని బుధవారం రోజున కోవిడ్ నిబంధనాలకు లోబడి  పరిమిత సంఖ్యలో జరుపుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ నవమి పండుగను కోవిడ్ నిబంధనాలు పాటించి భక్తులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆలయ పాలకవర్గ కమిటీలను నియమించమని పేర్కొన్నారు. ఆలయ పాలకవర్గం దాతల నుండి విరాళాలు సేకరించి ఆలయ అభివృద్ధికి భక్తులకు సరైన సౌకర్యాల నిమిత్తం కృషి చేయాలని మానవసేవయే.. మాధవసేవ.. ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో దరూర్ క్యాంప్ కోదండ రామాలయం నూతన చైర్మన్ బ్రహ్మాండబేరి నరేష్ విద్యానగర్ ఆలయ చైర్మన్ కాశెట్టి తిరుపతి ఆలయ పాలకవర్గ సభ్యులు కౌన్సిలర్లు ఒద్ది శ్రీలత రామ్మోహన్ కూసరి అనిల్ మాజీ చైర్మన్ గౌరిశెట్టి హరీష్ కెడిసిసి జిల్లా డైరెక్టర్ రామచందర్ రావు తెరాస నాయకులు బోగ ప్రవీణ్ శరత్ రావు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.