తమ జీవనాధారమైన స్థలం ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమంటున్న గీతన్నలు నేడు మొక్కలు నాటేందుకు అధ

Published: Monday August 29, 2022
పాలేరు ఆగస్టు 28 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బృహత్ ప్రకృతి వనం స్థలం వివాదం తారా స్థాయి కి చేరుతుంది. ఆ ఆ స్థలం లో ఎటువంటి వనం ఏర్పాటు కు స్థలం ను వదులుకోమని గీత కార్మికులు' ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొండపల్లి లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వెనక భాగంలో ఈత వనం ను ఆధారం చేసుకుని 110 మంది గీత కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాగా ఆదే స్థలం లో ప్రభుత్వం కొత్తగా బృహత్ ప్రకృతి వనం ను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యంత్రాలతో భూమిని చదును చేశారు. దీంతో గీత కార్మికులు నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి గీత వనం ను నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని. మా జీవితాలు నాశనం చేయవద్దని వేడుకుంటున్నారు..
 
కాగా సోమవారం ప్రకృతి వనం లో మొక్కలు నాటేం దుకు అధికారులు
చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొక్కలను నాటనీయమని గీత కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గీత కార్మికుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలవనున్నట్లు తెలిపారు. సోమవారం మొక్కలు నాటకుండా గీత కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి నిరహర దీక్షలకు దిగుతామని సంఘం నాయకులు ప్రకటించారు. ఇటు ప్రక్క గీత కార్మికుల నిరసనలు, అటు ప్రక్క జిల్లా అధికారులు వనం ఏర్పాటు లక్ష్యంతో మండల అధికారులు