బత్తిని చారిటబుల్ ట్రస్ట్ మెగా క్యాంపు విజయవంతం

Published: Monday February 07, 2022
బోనకల్, ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో పేద ప్రజల మనిషి, అమరజీవి తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్థం మేఘ శ్రీ హాస్పిటల్ నందు నిర్వహించే బీపీ, షుగర్, కంటి ప్రత్యేక వైద్య శిబిరం బీపీ, షుగర్, కంటి పేషెంట్లకు ఓ వరమని మేఘ శ్రీ హాస్పిటల్ జనరల్ వైద్య నిపుణులు లక్కబత్తిని గంగాధర్ గుప్తా అన్నారు. మండల కేంద్రంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే బీపీ, షుగర్, కంటి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ ప్రత్యేక క్యాంపు మండల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందన్నారు. 100 రూపాయలకే బీపీ షుగర్ మందులు అందజేస్తున్న బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ను అభినందించారు . మండల ప్రజలు ఈ ప్రత్యేక క్యాంపును సద్వినియోగిoచుకోవాలని పేర్కొన్నారు. ఈ క్యాంపు లో వైద్యులు గంగాధర్ గుప్తా బీపీ, షుగర్ పేషెంట్ లను పరీక్షించి మందులను అందజేశారు. కంటి వైద్య నిపుణులు శీలివేరి అశ్విన్ సిదార్ద్ కంటి పరీక్షలు నిర్వహించగా, దంత వైద్యులు సోమనపల్లి ఉదయ్ కిరణ్ దంత వైద్య సేవలు అందించగా క్యాంపు నిర్వాహకులు ఆకెన పవన్, ఆర్ఎంపీడబ్ల్యూటిఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మి నేని కొండలరావు, సాధన పల్లి అమర్నాద్ లు క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ట్రస్ట్ సభ్యులు తూము కుమార్, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేష్, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనంద్ రావు, ఏలూరి పూర్ణ చంద్ తదితరులు పాల్గొన్నారు.