విద్యార్థి సంఘం నాయకుడి ఆధ్వర్యంలో బండ ప్రకాష్ జన్మదిన వేడుకలు.

Published: Wednesday October 19, 2022

విద్యార్థి సంఘం నాయకుడి ఆధ్వర్యంలో బండ ప్రకాష్ జన్మదిన వేడుకలు.                                                 ప్రజా పాలన -శేరిలింగంపల్లి అక్టోబర్ 18 న్యూస్

:బడుగు బలహీన వర్గాలు
 ఆశాజ్యోతి, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు,, ముదిరాజ్ జాతి మార్గదర్శి, తెలంగాణ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ జన్మదిన వేడుకలను యూనివర్శటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ బీసి సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు, మాస్టర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. బండ ప్రకాష్ నిండు నూరేళ్ళు ఆయురారగ్యాలతో జీవించాలని, మరింత ఉన్నతమైన పదవులను పొందాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.