అందరూ ఆరోగ్యముగా ఉండాలి అందులో మనం ఉండాలి

Published: Friday April 08, 2022
మధిర ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలో గురువారం నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దెందుకూరు గ్రామంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా.శశిధర్ ఆధ్వర్యంలో పారా మెడికల్ బృందం పిహెచ్సి దెందుకూరు తరపున వివిధ ఆరోగ్య చిత్రపటాల ద్వారా అవగాహన ర్యాలీ ప్రదర్శించారు. ఆరోగ్య విస్తీర్ణ అధికారి హెచ్ఈఒసనప గోవింద్ హెల్త్ విజిటర్ బి కౌసెల్య  మాట్లాడుతూ సమాజంలో ప్రతిమనిషి ఆయు రారోగ్యాలతో  పదికలాలు పాటు చల్లగా ఉండాలి అంటే సరైన పోషకాహారం తీసుకోని రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా మానసిక వత్తిడి తగ్గించుకొని దుర్వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మానసిక శారీ రకoగా ఆరోగ్యo కలిగి ఉండాలి అని తెలియజేసీ నారు. అదే విధంగా ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ ను కలవాలి అని పిహెచ్సిలో ఉచితంగా అన్ని జబ్బులకు రక్త పరీక్షలు చేసి టి హబ్బు ద్వారా సెల్ కి వారి వారి ఆరోగ్య వివరాలు పంపుతారు అని సూచించారు. ఈ కార్యక్రమం పిహెచ్సి పరిధిలో పని చేసి ఎఎన్ఎమ్ లు హెల్త్అసిస్టెంట్ లు స్టాఫ్ నర్స్ లు ఫార్మా సిస్ట్ ఆశ కార్యకర్తలు సూపర్ వైజర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.