కన్నాపూర్ రైతు వేదికలో ప్రపంచ మృత్తిక దినోత్సవం.

Published: Tuesday December 06, 2022

శంకరపట్నం డిసెంబర్ 05 ప్రజాపాలన రిపోర్టర్:

ప్రపంచ మృతిక దినోత్సవం అని పురస్కరించుకొని శంకరపట్నం మండల కేంద్రంలోని కేశపట్నం మొలంగూర్ తాడికల్  కన్నాపూర్ మెట్టుపల్లి క్లస్టర్ వేదికల్లో ప్రపంచ మృత్తిక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కన్నాపూర్ మొలంగూర్ క్లస్టర్ రైతు వేదిక కు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి వి శ్రీధర్ మాట్లాడుతూ రైతులకు నేల యొక్క నాణ్యత ప్రాముఖ్యతను వివరించారు నేలకు రైతుకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. అధిక ఎరువులు పురుగు మందులు వాడకం వాడడం వల్ల నేల నాణ్యత తగ్గి నేల కాలుష్యం అవుతుందని నేల ఆరోగ్యం కోసం పచ్చిరొట్ట పైరులైన జనుము, జీలుగా, పెసర, సాగు చేసుకోవాలని సూచించారు. రాబోయే తరాల వారి కోసం ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన నేలలు అందించాల్సిన బాధ్యత ఈనాడు రైతులపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ శ్రీనివాస్,ఏ.ఈ.ఓ రాజ్ కుమార్,శైలజ, లక్ష్మీ ప్రసన్న, శ్రావణి,సుమలత రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ నిమ్మచెట్టి వీరస్వామి జిల్లా రైతుబంధు సమితి సభ్యులు అంతం తిరుపతిరెడ్డి సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామ రైతు అనుభ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ మరియు రైతులు పాల్గొన్నారు