శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సహలు

Published: Friday August 13, 2021
బాలాపూర్: ఆగస్టు12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాలనీ వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్థానిక కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36 డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, కాలనీ ప్రెసిడెంట్ బళ్లారి శ్రీనివాస్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు (13/8/2021) అయోధ్య నగర్ లో రోడ్ నెంబర్- 5, శ్రీ శ్రీ నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సహాలకు పలువురు ముఖ్య అతిథులను ఆహ్వానిస్తున్న ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆలయ కమిటీ సభ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... అయోధ్య నగర్ కాలనీవాసులు అందరికీ శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కాలనీవాసులందరికి కార్పొరేటర్గా గెలిస్తే అయోధ్య నగర్ లో ఉన్న పురాతన నల్ల పోచమ్మ (సుమారు 40 సం.ల) అమ్మవారి దేవాలయం పునర్ నిర్మిస్తానని తన డివిజన్ కాలనీవాసులకు హామీ ఇచ్చానని, అమ్మవారి ఆశీర్వాదం, డివిజన్ ప్రజల అభిమానంతో ఘన విజయం సాధించినందుకు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నానని అన్నారు. తన తండ్రి జ్ఞాపకార్ధ గా (ఎడ్ల శ్రీ రాములు) సొంత ఖర్చులతో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు అతిథులతో శుక్రవారం నాడు నుండి (15/8/2021) ఆదివారం వరకు అమ్మవారి  మహాఅన్నదాన ప్రసాదం, భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరారు. మొదటి రోజు గణపతి పూజ తో ప్రారంభమై తీర్థ ప్రసాద వితరణ......, రెండో రోజు అహహిత దేవతపూజా, హోమాలతో మొదలై విగ్రహ ప్రతిష్ట పూర్ణాహుతి......., మూడో రోజు అహాహిత దేవత పూజ, దుర్గాసప్తశతీ, చండీ హోమం తో మొదలై అమ్మవారికి బోనాల సమర్పణ, మహా అన్నదానం, ముఖ్య అతిథుల కు సన్మానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బళ్ళారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి  కూర రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. నవీన్ కుమార్, కోశాధికారి కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి ఎం కిరణ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.