యావర్ రోడ్డు పనులు విస్తృతంగా చేపట్టాలి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Thursday June 24, 2021
జగిత్యాల, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాలలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణ పనులు కాంగ్రెస్ పార్టీ పక్షాన వందశాతం స్వాగతిస్తున్నామని జీవన్ రెడ్డి అన్నారు. యావర్ రోడ్డు విస్తరణ పనులు కవిత ఎంపీగా ఉన్నప్పుడు చేపడితే మంచి పెరు వచ్చేదని పాపం కవితకు ఆ పేరుకూడ రాకుండ చేశారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన యావర్ రోడ్డు విస్తరణ పనులు వంద శాతం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని తెలిపారు. 2017 లో యావర్ రోడ్డు వంద ఫీట్ల విస్తరణ చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేస్తే ఆనాడే తెరాస ప్రభుత్వం స్పందించి ఉంటే ఈ రోజు కవితకు మంచి ప్రాధాన్యత వచ్చేదని తెరాస శ్రేణులకు ఎమ్మెల్సీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి బండ శంకర్ కౌన్సిలర్లు కల్లేపల్లి దుర్గయ్య నక్క జీవన్ గాజుల రాజేందర్ దేవేందర్ రెడ్డి నందయ్య గుంటి జగదీశ్వర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.