పోలియో చుక్కలు వేయించండి... చిన్నారులను రక్షించండి

Published: Thursday February 24, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 23 ఫిబ్రవరి ప్రజాపాలన : జిల్లాలో 0-5 సంవత్సరాలు వయసు గల పిల్లలందరికి రెండు చుక్కలు పోలియో మందు వేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్  హాలులో  వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ పోర్స్ కమిటి సమావేశంలో అయన మాట్లాడుతూ, ఈ నెల 27-02-2022న, మరియు 28-02-2022, 01-03-2022 తేది లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 0-5 వయసు గల 93, 232 మంది పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేసే విధంగా డీఈఓ, డిపిఓ, డిడబ్ల్యూఓ అధికారులు వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని సూచించారు.  జిల్లాలో అన్ని గ్రామాల్లో, అర్బన్ ప్రాంతాల్లో, మున్సిపాలిటీ లలో 670 పోలియో బూత్ లు ఏర్పాటు చేసి అర్హత గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలియో పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.  మండలం, మున్సిపల్ పరిధిలో ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు పోలియో కార్యక్రమం నిర్వహించే తేదిలు, బూత్ వివరాలు తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో చుక్కలు వేసుకునేలా ప్రచారం చేయాలనీ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉన్నందున సంబంధిత అధికారులు పోలియో బూత్ లను ముందుగానే సిద్ధం చేసుకొని బూత్ లలో  నీటి వసతి, కుర్చీలు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రద్ది ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ లను ఏర్పాటు చేసి బూత్ వివరాలు, తేది, సమయం అన్ని వివరాలను తెలియపరచాలని అన్నారు. పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు ఈ నెల 28న మరియు మార్చి, 1వ తేదీన ఎ.ఎన్.ఎం లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఉన్న ఐదేల్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయంచాలని తెలిపారు. జిల్లాలో అర్హత గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు పూర్తి సహకారం అందించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాను  పోలియో ఫ్రీ జిల్లాగా మార్చేందుకు అందరు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను కోరారు. పోలియోతో పాటు 05 సంవత్సరాలు, 07 టీకాలు అనే నినాదంతో 0-6-10-14 వారాలు 10 నెలలు, 16 నెలలు, 05 సంవత్సరాలు చొప్పున 07 సార్లు టీకాలు వేయించుకొని తమ పిల్లలకు అన్ని రకాల వ్యాధులతో సంరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యా అధికారి తుకారం, డిప్యూటీ డియంహెచ్ఓ జీవరాజ్, డి.ఇ.ఓ. రేణుకా దేవి, డి.పి.ఓ. మల్లారెడ్డి, డిడబ్ల్యూఓ లలితాకుమారి, డాక్టర్ అరవింద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లలిత, డబ్ల్యూహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ మురహరి సంబంధిత అధికారులు తదితరులు  పాల్గొన్నారు.