ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి--కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రె

Published: Tuesday July 26, 2022

రాయికల్, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి): ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రభుత్వం నుంచి  సాంత్వనము కరువై రైతులను ఆదుకొమ్మని   ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తు చేస్తున్నానని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని  జగన్నాథ్పూర్,బోర్నపెల్లి గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి,వరదలకు నష్టపోయిన పంటలను,ధ్వంసమైన రహదారులను పరిశీలించారు.అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.భారీ వర్షాల కారణంగా పూర్తిగా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం ఇల్లు మంజూరుచేయాలన్నారు.ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులు బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 25శాతం,కేంద్ర ప్రభుత్వం 75శాతం పరిహారాన్ని అందించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.బాధితులను ఆదుకోవడానికి నష్టం అంచనవేసి నివేదికను కేంద్రానికి అందించి సహాయం పొందే అవకాశం ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో సహాయం పొందడంలో విఫలమవుతుందని, ఎస్టీ అభివృద్ధి నిధులు రూ.25 వేల కోట్ల నిధులు ఉన్నప్పటికీ కేటాయించక పోవడం తో నిధుల క్యారీఫార్వర్డ్ అవడానికి కారణం ఏంటనిప్రశ్నించారు.బోర్నపెల్లి గ్రామంలో కౌలు రైతులను కాపాడే నిమిత్తం వార్తా సేకరణకు వెళ్లి వీధి నిర్వహణలో మృతిచెందిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టు జమీర్ కుటుంబానికి వరద ప్రవాహలా పర్యవేక్షణ కింద ప్రభుత్వం జీవో నెంబర్ ఎం.ఎస్ 2 ప్రకారం రూ4 లక్షల ఆర్థిక సాయం చేసే అవకాశం ఉండి కూడా ఇప్పటికీ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు,పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యెడి మహిపాల్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షాకీర్,నాయకులు ఎద్ధండి దివాకర్ రెడ్డి,పరాచ శంకర్,బాపు రపు నర్సయ్య,కొడిపెళ్లి ఆంజనేయులు,ప్రహ్లాద్ హరీష్,  చౌడారపు లక్ష్మీనారాయణ,కడకుంట్ల నరేష్,కొత్త పెళ్లి గోపాల్,మండ రమేష్,జలపతి,  లింగంగౌడ్,తదితరులు పాల్గొన్నారు.