కోరుట్లలో బతుకమ్మ చీరల పంపిణీ

Published: Saturday October 09, 2021
కోరుట్ల, అక్టోబర్ 08 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని 5వార్డులో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల ప్రకారం కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య - అనిల్ సహకారం తో శుక్రవారం రోజున 5వార్డ్ కౌన్సిలర్ పేర్ల సత్యం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పేర్ల సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన తరువాతనే మహిళలకు సరైన గౌరవం ఏర్పడిందని టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉందని అలాగే ప్రతి మహిళ సొంతంగా ఆర్థిక అభివృద్ధి చెందాలని, మహిళ గ్రూపులకు రుణాలు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను పంపిణీ చేసి, మహిళల ఆత్మ గౌరవాన్ని చాటిన గొప్ప వ్యక్తి కె.సి.ఆర్ అని పేర్ల సత్యం కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో- ఆప్షన్ సభ్యురాలు కటుకం సుశీల-గణేష్, అర్పి గంధం, పద్మ తదితరులు పాల్గొన్నారు.