లవ్ రెడ్డి టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన నందమూరి బాలకృష్ణ

Published: Thursday March 31, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : అంజన్ రామచంద్ర , శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతాన్ష్ ప్రొడక్షన్స్, సెహరి స్టూడియోస్ బ్యానర్స్ లపై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''లవ్ రెడ్డి''. టైటిల్ పోస్టర్ ను బుధవారం నటులు నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యంగ్ టీమ్ అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులకు ఈ సందర్భంగా బెస్ట్ విషన్ తెలిపారు.. అనంతరం చిత్ర యూనిట్ సబ్యులు మాట్లాడారు..ఆంధ్ర, కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరణ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారని అన్నారు. ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని మిగితా షూటింగ్ ను కర్ణాటక లోని బాగేపల్లి, చిక్కబల్లాపూర్ లో  బెంగళూరు లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి త్వరలో ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీతం దర్శకులు ప్రిన్స్ హెన్రీ ఎడిటింగ్ చోటా కె ప్రసాద్ సహా నిర్మాతలు నవీన్ రెడ్డి, సుమలత రెడ్డి, సుస్మిత రెడ్డి, హరీష్, పిఆర్ఓ శ్రీధర్ లు తదితరులు పాల్గొన్నారు.