సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

Published: Thursday September 15, 2022
తల్లాడ, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్):
 
 తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన సమ్మక్క, సారలమ్మ దేవాలయాలు నెలకొని ఉన్నాయి. బుధవారం భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవార్లకు పట్టు చీర, సార్లను సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భూక్యా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ప్రత్యేకంగా అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు.