ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇ

Published: Monday October 10, 2022

ఆదివారంరోజున ఇబ్రాహీంపట్నంలోని పాషా,నరహరి స్మారక కేంద్రంలో సిఐటియు ఇబ్రహీంపట్నం మండల జనరల్ బాడీ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన కార్మికులకు మాత్రం ఎక్కడా కూడా వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అందడం లేదు. ఉద్యోగ భద్రత కరువైందన్నారు. కనీస వేతనాల జీవోలను సవరించి పెరిగిన ధరకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కాదని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4లేబర్ కోడ్ లను విరమించుకోవాలి. లేబర్ కోడ్ ల ద్వారా కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని, యాజమాన్యాలకు స్వేచ్ఛను ఇచ్చే విధంగా ఉన్నాయి. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో కార్మిక పోరాటాలు ముందుకు వస్తాయని అయినా హెచ్చరించారు.

అనంతరం సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కన్వీనింగ్ కమిటీని 21మందితో ఎన్నుకోవడం జరిగింది. మండల కన్వీనర్ గా సి.హెచ్ బుగ్గరాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవదాసు, సత్తిరెడ్డి, బేబీ, బాల్ రాజ్, ఐలయ్య, రాజశేఖర్, మల్లేష్, రాణి, అండాలు, అబ్బమ్మ, కిషన్, లక్ష్మమ్మ, సత్యనారాయణ, రాములమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.