భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

Published: Thursday February 18, 2021

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 17, ప్రజాపాలన : భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షలు భాను ప్రకాష్ తోపాటు యువ మోర్చా నాయకులపై టి.ఆర్ . యస్ .ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న నేపథ్యంలో అక్రమ కేసులు ఎత్తి వేయాలని ప్రతి అసెంబ్లీ కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బుధవారం మంచిర్యాల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేవైఎం నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే సహించబోము అని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తం అని అన్నారు. అసలైన బంగారు తెలంగాణ బీజేపీ తోనే సాధ్యం అని అన్నారు. అదేవిధంగా పోలీసులు టి.ఆర్.యస్ .పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పని చెయ్యాలి అని పోలీసు మిత్రులను కోరాను. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట క్రిష్ణ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.