సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మరియు "మా" ఇ.ఎన్.టి...

Published: Thursday September 01, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి ):
 
 గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఇ.ఎన్.టి వైద్యం చేయించుకోలేని వారికి శుభవార్త. అలాంటి వారికోసం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ (రోటరీ డిస్ట్రిక్ట్ 3150) ఆధ్వర్యంలో మొబైల్ ఇ.ఎన్.టి & హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించారు. దీనికి "మా" ఇ.ఎన్.టి సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి ఈ మొబైల్ ఇ.ఎన్.టి & హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ఒక ఇ.ఎన్.టి డాక్టర్, టెక్నికల్ టీం, ఆడియాలజిస్ట్ ఈ వ్యాన్ లో అందుబాటులో ఉంటారు. వారు రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. పీహెచ్ సీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొబైల్ వ్యాన్ సహాయంతో స్క్రీనింగ్ జరుపుతారు. దీని ద్వారా పిల్లల్లో వినికిడి సమస్యలు త్వరగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. వారికి అవసరమైన ట్రీట్ మెంట్ సకాలంలో అవకాశం ఉంటుంది. 
 
పి.డి.జి అనిరుధ రాయ్ చౌధురి (రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఎలక్ట్) చేతుల మీదుగా మొబైల్ ఇ.ఎన్.టి & హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభమైంది. సునీత జి కుమార్ (“మా” ఇ.ఎన్.టి సి.ఎం.డి), డిజీ రాజ శేఖర్ రెడ్డి, డీజీఈ శంకర్ రెడ్డి, డీజీఎన్ శరత్ చౌదరి, పీడీజీ రవి వడ్లమాని, పీడీజీ రవీ దోత్రే, పీడీజీ సంగ్రామ్ పాటిల్, డి.ఆర్.ఎఫ్.సి పీడీజీ రమేష్ వంగల, పీడీజీ హన్మంత్ రెడ్డి, ఆర్ టీన్ సాయి కుమార్, ఆర్ టిఎన్ ఉదయ్ పిళని  తదితరులు ఇందులో పాల్గొన్నారు. 
 
వినికిడి సమస్యలు ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ మొబైల్ వ్యాన్ దోహదపడుతుందని "మా" ఇ.ఎన్.టీ సిఎండి సునిత జి కుమార్ వెల్లడించారు. రోటరీ ఇంటర్నేషనల్ చొరవను ప్రశంసించారు.
 
 
 
Attachments area