మినీ అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

Published: Friday May 27, 2022

 మంచిర్యాల టౌన్,మే 26, ప్రజాపాలన : మినీ అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ లోని  స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ కు సి ఐ టి యు ఆధ్వర్యంలో పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ,కవిత, సభ్యులు కళ్యాణి, భానుమతి, మౌనిక, తిరుపతమ్మ, సావిత్రి, దుంపల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.