ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *స్వామి వివేకానంద 160 వ జయంతి ఘనంగా నిర్వహించార

Published: Friday January 13, 2023
భారతీయ జనతా పార్టీ రాయపోల్ మాజీ ఎంపీటీసీ దోండ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అపురూప ప్రజ్ఞావంతుడు పాశ్చాత్య తత్వ శాస్త్రముతో సహా పలు విభిన్న జ్ఞాన క్షేత్రాలలో విస్తృత పరిజ్ఞానం లోతైన అవగాహన ఉన్న ధీమంతుడు హిందూ మత సందేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అందించిన తొలి భారతీయ స్వామి వివేకానంద 160వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మత ప్రాతినిధ్య మహాసభలో వివేకానంద ప్రసంగం ఆ సభలో పాల్గొన్న సమస్త మతాల ఆచార్యులు ఆధ్యాత్మికుల మనసులపై చెరగని ముద్ర వేసింది నేటి యువతకు స్వామి వివేకానంద యుగ పురుషుడని మేల్కోండి గమ్యం చేరే వరకు విస్మరించకండి అనే సుక్తిని మార్గదర్శకుడని అన్నారు, ఇనుప కండరాల్లూ ఉక్కు నరాల్లో వజ్ర సంకల్పం గల యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు  రావుల మల్లేష్ , వెలగ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షలు దోండ రమణారెడ్డి, గంగనమోని సతీష్, మేకల సత్యనారాయణ, వార్డుమెంబర్ దోర్నాల నర్సింహ్మ, గోదాల శేఖర్ రెడ్డి, శీలోజు శ్రీనివాస్ చారి, కసరమోని నర్సింహ్మ యాదవ్,  మేకల సురేష్, పోలింగ్ బూత్ అధ్యక్షలు ఉడుగుల విజయ్, ఏర్పుల అర్జున్, కాన్గుల అనిల్, కర్రె ఇబ్రహీం, దాసరి రవి, కాన్గుల సంతోష్, నాయకులు కోంగర శ్రీనివాస్, నాంపల్లి శంకర్, మోర రాజు రాసుల లింగస్వామి సింగారం శ్రీకాంత్ మేకల నవీన్ దోర్నాల శివ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.