కరోనా మహమ్మారి వైరస్ అంతం కావాలని ప్రత్యేక పూజలు

Published: Thursday April 22, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజా పాలన : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నందున్న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుకొనే లేక పోతున్నామని ఆవేదన వెలిబుచ్చన మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు యాదవ్ అన్నారు. కరోనాపై రామ బాణమే వ్యాక్సిన్, మాస్కులు, భౌతిక దూరమే ప్రజలకు శ్రీరామ రక్ష పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రత్యేక పూజలుచేశారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు. ఆలయ ఛైర్మన్ ఏనుగు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేత శ్రీరాములును సన్మానించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ... కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నందున్న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ అంతం కావాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు శ్రీరాములు. భక్తులు ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటిస్తూ... దైవ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్ట్యైశ్వర్యాలతో బాగుండాలని ఆకాంక్షించారు అందెల శ్రీరాములు యాదవ్. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, లింగం యాదవ్, యెల్చల భాస్కర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి సహా బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.