భారతరత్న ,రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంత

Published: Wednesday December 07, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకలలో పాల్గొని, మరియు మండలంలోని క్యాంపు కార్యాలయం నుంచి నడుచుకుంటూ వెళ్లి అంబేద్కర్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
 భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, మహనీయుడికిదే మా ఘన నివాళులు తెలిపి, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అన్నారు, గౌరవ సీఎం కేసీఆర్  నాయకత్వంలో ఎనిమిదిన్నర సంవత్సరకాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్  ఆశయ సాధన కోసం కృషి చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు, ఇంతటి మహోన్నతమైన వ్యక్తి వర్ధంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు, దేశంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కొరకు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగం అందించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్  అని ప్రతి ఒక్కరూ ఆశయాలను కొనసాగించాలని నలవాలని అన్నారు, దళితుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్  కృషి చేస్తున్నారు, దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని అన్నారు, ఈ పథకం ద్వారా స్వయంగా యజమానులుగా మారుతారు, దేశంలో ఏ రాష్ట్రంలోని లేనివిధంగా దళిత బంధు అమలు అవుతుంది అని తెలిపారు, తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నామన్నారు,
ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం, బిఆర్ఎస్  పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.