ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి * తక్కల్లపల్లి తండాలో డ్రైనేజీ పునరుద్ధరణకు 2.50

Published: Wednesday January 25, 2023

మూడవరోజు ప్రగతి నివేదన యాత్రలో భాగంగా యాచారం మండలం నక్క గుట్ట తండా, ఎర్రగొళ్ల తండా, తక్కల్లపల్లి తండాలలో మంగళవారం గడపగడపకు పాదయాత్ర కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు మంచిరెడ్డి బంటి బాబు ప్రతి తండా కలియతిరుగుతూ గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకం కావటం జరిగింది.తక్కెళ్లపల్లి తాండలో గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను వింటున్న క్రమంలో అంగోత్ లీల జైపాల్ కుటుంబం వారు మా ఇంట్లో రొట్టె తినాలని బంటిని ఆహ్వనించగా కాదనకుండా వారి ఇంటికెళ్లి అల్పహరంగా రొట్టె ఆరగించారు. అదేవిధంగా తాండలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న పౌష్టికారం, విద్యాబోధన ఇతర విషయాలపై టీచర్లను అడిగి తెలుసుకున్నారు. బాలబాలికలకు బిస్కెట్లు ఇచ్చి వారితో కాసేపు సరదాగా గడిపారు. తక్కెళ్లపల్లి తాండాలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరణ చేయటానికి ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  2.50లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు బంటి ప్రజలకు తెలిపారు. ఇకపై వర్షాకాలంలో డ్రైనేజీ కి సంబందించి ఎలాంటి ఇబ్బంది ఉండదని బంటి అన్నారు.ఎర్రగొళ్ల తాండ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే రవాణా వ్యవస్థకు ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లేవి అయితే ఈ సమస్యను బంటి బాబు దృష్టికి తీసుకురావటంతో వెంటనే డిపో మేనేజర్ కు  ఫోన్ చేసి ఎర్రగొళ్ల తాండ వద్ద బస్సులు ఆపాలని కోరటం జరిగింది. దీనికి స్పందించిన డిపో మేనేజర్  ఇకపై వచ్చే బస్సులు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. దీంతో తాండ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ బంటికి ధన్యవాదాలు తెలిపారు. తక్కలపల్లి గ్రామంలో నుండి కరెంటు పెద్ద లైను వెళ్తే ఇబ్బందులు వస్తాయని, సిసి రోడ్లు డ్రైనేజీ,దళిత బంధు,రైతుబంధు, రైతు బీమ, ఇండ్ల సమస్యలు బంటి దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
ప్రగతి నివేదన యాత్రలో డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ బాష, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ప్యాక్స్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సర్పంచ్ జగదీష్, గ్రామశాఖ అధ్యక్షుడు భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శంకర్, తలారి మల్లేష్ , నాయకులు ఓరుగంటి యాదయ్య, కల్లూరి శివకుమార్, రాజేందర్ రెడ్డి, జర్కుని రాజు  తుర్కయాంజల్, ఆదిభట్ల మున్సిపాలీటీల స్థాయి నాయకులు, బంటి యూత్ పోర్స్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.