ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 3 ప్రజా పాలన ప్రతినిధి **పట్నం మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు యువజన క

Published: Tuesday April 04, 2023

*యువత మండల అధ్యక్షులు దోర్నాల రాము*

ఇబ్రహీంపట్నం మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు మరియు యువత నూతన కమిటీని ఎన్నుకున్నారని మండల నూతన యువత అధ్యక్షులు దోర్నాల రాము తెలిపారు ఆదివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో నియోజకవర్గ కుమ్మరి సంఘం అధ్యక్షులు కాసుల పాండు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలం నూతన అధ్యక్షులు బత్తుల జంగయ్య, యువజన అధ్యక్షులు దోర్నాల రాముని ఎన్నుకోవడం జరిగింది నీ వివరించారు ఈ కార్యక్రమంలో కుమ్మరుల ఆశయ అభివృద్ధికై, కుల వృత్తుల ప్రోత్సాహంలో వెన్నంటి ఉండి అభివృద్ధికి తోడ్పడుతారని తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువత అధ్యక్షులు కొండాపురం నాగరాజు, బసాపురం కృష్ణ, మల్లేశా, జయ ప్రకాష్, కృష్ణయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.