పట్లూరులో హనుమాన్ దేవాలయం ప్రారంభం

Published: Tuesday January 31, 2023
* పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : పట్లూరు గ్రామంలో ఫిబ్రవరి 10 11 12 తేదీలలో హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను ప్రత్యేకంగా ఆహ్వానించామని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ దేవరదేశి అశోక్  మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు తమ ఇష్ట దైవాన్ని తలచుకొని కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చని తెలిపారు. ప్రతిరోజు తాను నమ్మిన దైవదర్శనము చేసుకున్నచో పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. హనుమాన్ దేవాలయం ప్రారంభానికి ఆహ్వానించిన వారిలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గొల్ల ముసలి అశోక్ కమిటీ సభ్యులు ఎస్ శ్రీశైలం కోట పాండు తదితరులు ఉన్నారు.