మెడికల్ కాలేజి కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన - జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Wednesday May 19, 2021
జగిత్యాల, మే 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా పేద ప్రజల చిరకాల కోరిక మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలు మంజూరి చేసిన సీఎం కేసీఆర్ కు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వసంత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలనే ధృడ సంకల్పంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలవడానికి ప్రణాళికలు ప్రకారం మార్గదర్శకం చేస్తున్న సీఎం కేసీఆర్ భారత రాజ్యాగంలో డా: బి.ఆర్.అంబేడ్కర్ సూచించిన ప్రకారం చిన్న జిల్లాలతోనే అభివృద్ది సాధ్యం అని 32 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని నూతనంగా ఏర్పడిన జిల్లాలోని పేదవారికి కార్పోరేట్  మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను అదృష్టంగా భావించాలని వసంత కోరారు. జగిత్యాల జిల్లాకు మెడికల్ నర్సింగ్ కళాశాలల మంజూరి కొరకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితక్కకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక ఎమ్మెల్యే యం.సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే కే. విద్యాసాగర్ రావు వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్. రమేష్ బాబు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.