కరొనా పాజిటివ్ బాధితులకు మారి స్వచ్ఛంద సంస్థ అండ

Published: Wednesday June 02, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా పాజిటివ్ వచ్చిన వారు డాక్టర్ సలహాలు సూచనలు పాటిస్తూ, అధైర్యపడవద్దు, భయపడవద్దుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కార్యక్రమాల పనుల్ని సమీక్షించి కరోనా టెస్టింగ్ సెంటర్ రైతు మార్కెట్ వద్ద కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి హోమ్ ఐసోలేషన్ లో  నివాసముంటున్న మూడు కుటుంబాలకి  డ్రై రేషన్ ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదగా అందజేశారు. మంత్రి  మాట్లాడుతూ.... భారత గ్రామ నవనిర్మాణ మారి స్వచ్ఛంద సంస్థ వారు  చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా ఎవరు కూడా అధైర్యపడవద్దు, భయపడొద్దు  మీకు అండగా మేమున్నామని మారి స్వచ్ఛంద సంస్థ వాళ్లు భరోసా కల్పించారు. పౌష్టిక మైన ఆహారం, డాక్టర్ల సలహాలతో సకలంలో మందులు తీసుకోవాలని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారినుండి త్వరితగతిన  కోలుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మీ చేతుల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దిప్ లాల్ చొవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు సిద్ధాల లావణ్య బీరప్ప, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మారి సంస్థ కోఆర్డినేటర్ సాంబశివ, శివాని రెడ్డి, మహేశ్వరి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.