షార్ట్ సర్క్యూట్ తో మల్లారంలో జామాయిల్ తోట దగ్ధం

Published: Saturday April 08, 2023
మధిర ఏప్రిల్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ తో జామాయిల్ తోటలో మంటలు చెలరేగాయి.ఈ మంటల్లో దగ్ధమవుతున్న కొంగర విశ్వేశ్వరరావు జామాయిల్ తోట సుమారు 30 ఎకరాలు కాలిపోయింది. ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదనీ స్థానికులు అంటున్నారు. గ్రామ సర్పంచ్ మందడపు ఉపేంద్ర సంఘటన స్థలానికి చేరుకున్నారు.వరుసగా జామాయిల్ తోట పూర్తిగా మంటలతో దగ్ధమైనాయి. జామాయిల్ తోట షార్ట్ సర్క్యూట్ కు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.