మాటూరు హైస్కూల్ ఉపాధ్యాయులు వేము రాములుకు రాష్ట్రస్థాయి మదర్ తెరిసా సేవా పురస్కారం

Published: Thursday March 04, 2021
మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: అచరిత్వ పౌండేషన్ ప్రథమ వార్షికోత్సవాన్ని సంస్థ చైర్మన్ కృపాల్ ఆధ్వర్యంలో నెల్లూరు లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని వివిధ జిల్లాలలో, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి మదర్ థెరిసా రాష్ట్ర స్థాయి సేవా​ పురస్కారాలు అందజేశారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులు శ్రీ వేము రాములుకు విద్యా రంగంలో చేసిన సేవలను గుర్తించి ఫౌండేషన్ చైర్మన్ కృపాల్, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు గౌరీ చేతులమీదుగా సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ Y. ప్రభాకర్ గారు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఎవరికైనా వస్తుందని, భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొందాలని, ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పురస్కార గ్రహీతకు శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో ఇటువంటి పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు.ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  డి.సాయి కృష్ణమాచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.