బీసీ వసతి గృహాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 87.27

Published: Friday July 01, 2022
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్ 
వికారాబాద్ బ్యూరో జూలై 01 ప్రజా పాలన :
బీసీ వసతి గృహాల విద్యార్థులు 87.27 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 21 వెనుకబడిన తరగతుల వసతి గృహాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2021-22 విద్యా సంవత్సరమునకు గాను 305 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యారని వివరించారు. 266 మంది విద్యార్థులు  ఉతీర్ణు లైనారని  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్ తెలిపారు.   బిసి వసతి గృహముల నుండి మొత్తం 87.27% ఉతీర్ణత శాతం సాధించారని, ఇందులో 8 వసతి గృహముల నుండి 100 శాంతం ఉతీర్ణత సాధించారని అయన తెలియజేసినారు.