ప్రయాణికులకూ అవగాహన కల్పిస్తున్న ఆర్టీసీ కళాబృందం

Published: Wednesday August 18, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం సాగర్ హైవే పై డిపో మేనేజర్ బాబు నాయక్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల కళ బృందంచే అవగాహన నాట్యం ఈ కార్యక్రమంలో భాగంగా DVM డి.విజయ భాను మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాదు రెండు రోజుల కళాజాత కార్యక్రమాన్ని ఈడీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ప్రయాణికులకు ఆర్టీసీ అందిస్తున్న సౌకర్యాలు గురించి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు, నాట్యరంగం ద్వారా ప్రజలకు సులభంగా అర్థం కావడం కోసం ఏర్పాటు చేశామన్నారు, ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఆర్టీసీ చాలా పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు, ప్రయాణికులకు ప్రవేట్ వాహనాలు సురక్షితం కావు అని, ఆర్టీసీ లో ప్రయాణము సురక్షితంమే కాకుండా ఖర్చు తక్కువగా ఉంటుంది, భద్రత ఉంటుందని, ప్రతి ప్రయాణికునికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇలాంటి సందేశాత్మక కళ బృందాల ద్వారా ఊరూరా ప్రదర్శనలు నిర్వహింస్తున్నామనరు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బాబు నాయక్ సీఐ సరస్వతి భాగంగా సంబంధిత అధికారిని సరస్వతి, యాదగిరి, రాములు, శ్రీనివాస్ గౌడ్, విజయ్, శేఖర్, శ్రీనివాస్, పరమేష్, కళ బృందం సభ్యులు సంపత్, కుమార్, పేన్తోజి, శ్రీహరి, శ్రీనివాస్, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.