బీరుపూర్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Wednesday March 03, 2021

బీరుపూర్, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలోని కొండపై వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్సీకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేరుపూరి శుభాష్ ప్రధాన కార్యదర్శి నారపాక కమలాకర్ ఎంపీటీసీలు ఆడెపు మల్లీశ్వరితిరుపతి రంగు లక్ష్మణ్ గుడిసె శ్రీమతిజితేందర్ నవిన్ రావు ఏనుగు జోగిరెడ్డి ఎడ్ల శ్రీనివాస్ ఆలయ అధికారి శ్రీనివాస్ అర్చకులు మధుచార్యులు సంతోష్ చార్యులు రామచార్యులు సంతోష్ చార్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.