హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో దావ సురేష్ కు చోటు

Published: Monday June 21, 2021
జగిత్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): నూతనంగా ఏర్పడ్డ జిల్లాల ప్రతిపాదన నుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆరుగురు సభ్యులలో ఒక్కరైన జగిత్యాల జిల్లాకు చెందిన తెరాస జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేష్ కు హెచ్.సి.ఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ శనివారం రోజున నియామకపు పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు తెలంగాణలో పెరిగిన ‌జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్.సి.ఏ సభ్యుల సంఖ్యను పెంచి అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా నూతన జగిత్యాల జిల్లాకు అడహాక్ కమిటీ సభ్యునిగా సురేష్ ను హెచ్.సి.ఏలో‌ సభ్యత్వం కల్పించారు. మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నైపుణ్యాలను ‌పెంపొందించనున్నట్ల అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. దావ సురేష్ కు ప్రజాప్రతినిధులు అధికారులు అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.