ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం కార్యకర్తల సమావేశం

Published: Wednesday March 03, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా  ప్రతి కార్యకర్త ఓటర్లు కలిసి వాణి దేవి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రులు తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోనీ మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు సిద్దాల లావణ్య ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో దిశా నిర్దేశం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంత్రులు హాజరై, ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.... హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, జిల్లాలో ఉన్న పట్టభద్రులు అయినటువంటి ఓటర్లను వంద మందికి  గ్రూప్స్ సూపర్వైజర్ కార్యకర్తలను నాయకులను దిశానిర్దేశం విశదీకరించారు. ప్రతి కార్యకర్తల గ్రూప్స్ లోనీ ఓటర్ కు టచ్ లో ఉండాలని నిర్మించారు. మాజీ పీవీ నరసింహారావు గారి కూతురు అయినటువంటి సురభి వాణి దేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ నియోజకవర్గం లో, టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి ఉండాలని చె్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి  సురభి వాణి దేవి గారిని గెలిపించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను  నాయకులను కార్యకర్తలను విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి హరీష్ రావు కార్యకర్తలందరికీ దశ నిర్దేశించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు అందరూ సురభివాణి దేవి ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లపార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, జిల్ల పరిషిత్ చైర్మన్ తీగల అనితా రెడ్డి, మాజీ శాససభ్యుడు తీగల కష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, కప్పటి పాండు రంగారెడ్డి, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దుర్గ దీప్ లాల్  చౌహాన్, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింతా పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధల లావణ్య బీరప్ప, ఆరకాల భూపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కామేష్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు బండి మీనా నగేష్ యాదవ్, ఇతర డివిజన్ల, మండలాల మున్సిపల్ కార్పొరేషన్ల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ ఎస్టీ సెల్, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, కో ఆప్షన్ సభ్యులు, యువజన విభాగం అధ్యక్షులు మరియు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు తదితరులు పాల్గొన్నారు.