టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే మాధవరం అదికారులకు ఫుల్ సిగ్నల్స్

Published: Wednesday May 19, 2021
కూకట్ పల్లి, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గం లో ప్రతి రోజు.. ప్రతి డివిజన్ లోని అసోసియేషన్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు... మంగళవారం బాల నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, ఆరోగ్య శాఖ అధికారులు జిహెచ్ఎంసి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ప్రధానంగా బాలానగర్ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ సరిగ్గా నిర్మించక వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు పొంగి ప్రవహించడంవల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని దీనివల్ల నీరు కలుషితమై మంచినీళ్లు లో కలవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  దృష్టికి తీసుకువచ్చారు... దీనికి వెంటనే స్పందిస్తూ... ఇలా ఎందుకు జరుగుతుంది తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే సభ్యులు చెప్పిన సమస్యను పరిష్కరించి నాకు త్వరలోనే నివేదిక ఇవ్వాలని.. ప్రజలకు అందుబాటులో ఉండి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు..... అలాగే కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఇంటి వద్ద కూడా శానిటేషన్ నిర్వహించాలని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారిని కోరారు... దీనికి సమాధానంగా ఇప్పటికే ప్రతి కాలనీలో శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీనిని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.... అలాగే మరికొన్ని కాలనీలో వీధిలైట్లు.. ట్రాన్స్ఫార్మర్ సమస్యలు డ్రైనేజ్ సమస్యలను. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు... వెంటనే అధికారులతో ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో పూర్తిచేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎక్కడ కూడా అలసత్వం వహించ రాదని.... ఆదేశాలు జారీ చేశారు... మరియు ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ... అందరూ కూడా ఎంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని.. ఏదైనా సమస్య ఉన్న ఎడల కంట్రోల్ రూమ్ నెంబర్.. 040 21111111 ఫోన్ చేసి  సమస్యను పరిష్కరించుకోవచ్చు అని.. ఈ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే సూచనలు సలహాలు తీసుకోవచ్చని.. అలాగే కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఎడల ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు... మరియు ఎప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటామని ఏ క్షణంలోనైనా మీరు ఫోన్ చేయొచ్చు అని.. అలాగే కార్పొరేటర్ గారి కార్యాలయంలో కూడా మెడికల్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  ప్రజలకు సూచించారు.