ఆరు చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Published: Tuesday April 20, 2021
మల్లాపూర్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అత్యవసర సమావేశం
మల్లాపూర్, ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి : మల్లాపూర్ మండలంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ వెంపేట నర్సారెడ్డి అధ్యక్షతన సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి సొసైటీ డైరెక్టర్స్ తో చర్చలు జరిపింది. స్థానిక కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు మల్లాపూర్ సొసైటీ ద్వారా పాత దామరాజు పల్లి, కొత్త దామరాజు పల్లి, మల్లాపూర్, గుండంపల్లి, రేగుంట, సాతారం ఆరు గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయించారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు వడ్లను ఆరబెట్టుకుని తీసుకురావాలటూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని, రైతులు మాస్కులు ధరించి కొనుగోలు కేంద్రానికి రాగలరని కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా అధ్యక్షులు తెలియజేశారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ గొండ రాజేందర్, సీఈవో భూమేష్, డైరెక్టర్స్ సుతారి రాజేందర్, నల్ల రాజారెడ్డి, పుండ్ర లక్ష్మారెడ్డి, కొత్తూరి నారాయణ, నిగ రవి, నల్లూరి గంగు పాల్గొన్నారు.