ఘనంగా ఉపాద్యాయ దినోత్సవం

Published: Tuesday September 06, 2022
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజాపాలన : సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. భృంగీ విద్యాసంస్థలలో  ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన విద్యాసంస్థల కార్యదర్శి ఎ. ప్రమీల.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. వారు బోధించటం ద్వారా తన విజ్ఞానాన్ని కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉండేవారు  అన్నారు. . డా.సర్వేపల్లి కష్టమైన అంశాన్ని అర్థం అయ్యే రీతిలో అతి సులభతరం చేసి చెప్పటంతో విద్యార్థులు శ్రద్ధగా విని నేర్చుకునేవారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి తెచ్చిన గుర్తింపు, గౌరవానికి ప్రతీకగా ప్రతీ సంవత్సరం అతని పుట్టిన రోజు సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రస్తుతం పిల్లలు ప్రతీ చిన్న సమస్యను పెద్దదిగా భావిస్తూ, కొంతమంది చదువును మధ్యలోనే వదిలేయడం, కష్టాలను ఎదుర్కోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తి ఎప్పుడూ గురుతరమైనదే. అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ స్పూర్తితో ఉపాధ్యాయులు చిన్నప్పటి నుండి సమస్యలను పరిష్కరించుకునే సామర్ధ్యాలను పిల్లలకు నేర్పి, వారి చదువును పూర్తిగా కొనసాగించి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతారని అన్నారు .ఈ కార్యక్రంమలో కళాశాల డైరెక్టర్  శివ ప్రసాద్ మరియు అధ్యాపక బృదం  పాల్గొన్నారు .
 
 
 
Attachments area