ఎల్.ఎమ్ కొప్పుల ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Published: Thursday March 18, 2021
ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత ఈశ్వర్.
వెల్గటూర్, మార్చి 15 (ప్రజాపాలన ప్రతినిధి) : రెండవరోజు కొనసాగిన వైద్యసేవలు ఎల్.ఎమ్. కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామంలో నిన్న ప్రారంభమైన వైద్య శిబిరం రెండవరోజు విజయవంతంగా ముగిసింది. నిన్న శిబిరానికి వచ్చిన వారిలో  వైద్య పరీక్షలు అవసరమైన రోగులకు  బుధవారం రోజున  ప్రతిమ సంచార ఆరోగ్య రథంలో వివిధ రకాలైన పరీక్షలను వైద్యబృందం నిర్వహించారు. ఇట్టి పరీక్షలలో ల్యాబ్ పరీక్షలు ఈసిజి 60 మందికి,ఎక్స్ రే 38 మందికి, 2డి ఇకొ 26, స్కానింగ్ 80, బ్లెడ్ టెస్ట్ 80 మందికి, మామో గ్రాఫి ముగ్గురికి మొత్తం 287 మందిని  పరీక్షించి వారికి కావాల్సిన మందులు ఉచితంగా అందించినట్లు ఎల్ ఎమ్ కొప్పుల ప్రెస్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి ఈ వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ వికాస్, డాక్టర్ దీపిక, ప్రతిమ పౌండేషన్ కౌశిక్, సర్పంచ్ మారం జెలెంధర్ రెడ్డి, ఎం.పీ.పీ కూనమల్ల లక్ష్మీ లింగయ్య, జట్పిటిసి శ్రీమతి బి. సుధారాణి రామస్వామి, ధర్మారం యం.పి.పి ముత్యాల కరుణ శ్రీ, మార్కెట్ కమిటి చైర్మన్ ఎలెటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి రియాజ్, తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ జీవన్ రావ్, తె.రా.స మండలం పార్టీ అధ్యక్షులు రాంచందర్ గౌడ్, తె.రా.స ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పదిరె నారాయణ రావు, వెల్గటూర్ మండల శాఖ తె.రా.స యువత అధ్యక్షులు బీడారి తిరుపతి, కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు జాడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.