బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్

Published: Tuesday September 27, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లోని కళ్యాణ్ పూరి కమ్యూనిటీ హాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ భారత దేశంలోనే పూలను పూజించే గొప్ప సాంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కుల,మతాలకు అతీతంగా హిందువులకు బతుకమ్మ పండుగ చీరలు, ముస్లింలకు రంజాన్ తోఫాలు, క్రిస్టియన్లకు క్రిస్మస్ గిఫ్టులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టి భారతదేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిసి అరుణకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏదుల కొండల రెడ్డి, వి బి నరసింహ , ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, కంచర్ల సోమిరెడ్డి, మాస శేఖర్, అల్లిబిల్లి మహేందర్, బాణాల నారాయణరెడ్డి,
రవీందర్ గౌడ్, రామానుజన్, ఫోటో బాలు, శీను నాయక్, శ్యామ్, సాయి, మహిళా అధ్యక్షురాలు సుభద్ర, సరిత , ఆండాలు , అంజలి ,సత్యవతి ఉమా ,శ్రీకాంత్ , మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Attachments area